ఇంటి పనికొచ్చిన తాపీ మేస్తీ.. ఇద్దరు స్త్రీలతో ఆ పని చేశాడు.. తెల్లారే సరికి ముగ్గురు కలిసి..

by Anukaran |   ( Updated:2021-12-23 10:07:58.0  )
ఇంటి పనికొచ్చిన తాపీ మేస్తీ..  ఇద్దరు స్త్రీలతో ఆ పని చేశాడు.. తెల్లారే సరికి ముగ్గురు కలిసి..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ గుడ్డిది అని అందరూ అంటుంటారు. నిజమే బెంగాల్ ఇద్దరు వివాహితలు ఒకే తాపీ మేస్త్రీ ని ప్రేమించారు. తర్వాత ముగ్గురూ కలిసి ముంబై వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లా, నిశ్చిందా లో ఒక ఇంటి నిర్మాణ పనిపై తాపీ మేస్త్రీ వచ్చాడు. పని కుదరడంతో రోజు అక్కడికి వచ్చి పని చేసుకునే వాడు. ఈ సందర్భంలోనే అదే ఇంటికి చెందిన ఇద్దరి మహిళలతో పరిచయం ఏర్పడింది. ఇంటి నిర్మాణం ముగిసే లోపు వారి ప్రేమాయణం ఎల్లలు దాటిపోయింది.

ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. దాంతో ఇద్దరు వివాహితలు ఆ తాపీ మేస్త్రీ తో కలిసి రాత్రికి రాత్రే పరార్ అయ్యారు. ఉదయం లేచి చూసే సరికి ఇద్దరు వివాహితలు కనపడలేదు. అందులో ఓ వివాహిత తన ఆరేళ్ల కొడుకుని కూడా వెంట తీసుకుని వెళ్లింది. అయితే మొదట్లో ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అనుకున్నారు. ఆ వివాహితల అత్తా మామలు నేరుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వివాహితల కాల్ చిట్టా బయటకు తీశారు.

దాంతో పోలీసుల అనుమానం నిజమైంది. ఆ తాపీ మేస్త్రీది ముర్షిదాబాద్ అని తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అక్కడితో వారు ముగ్గురు కలిసి ముంబై పోయినట్టు తేలింది. వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్థానిక పోలీసులు ముంబై పోలీసును సంప్రదించారు. ఆ నలుగురిని పట్టుకోవడానికి సహకరిస్తాం అని చెప్పడంతో కోల్ కత్తా నుంచి రెండు టీం లు ముంబాయి బయలు దేరాయి.

Advertisement

Next Story