ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసుల డిమాండ్

by Aamani |   ( Updated:2021-11-27 00:58:12.0  )
ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసుల డిమాండ్
X

దిశ, అదిలాబాద్: ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఐటీడీఏ లో.. అధికారులు జన్మదిన వేడుకలను నిర్వహించడం పట్ల ఆదివాసీ గిరిజనులు మండిపడుతున్నారు. ఆదివాసుల సమస్యలు పట్టించుకోకుండా అధికారులు ఏకంగా ఐటీడీఏ పరిపాలనా అధికారి ఛాంబర్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆపైనా… కుమురం భీం ప్రాంగణంలోని వైటీసీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులతోనూ అధికారులు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ జన్మదిన వేడుకల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఈ విషయం పట్ల ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల సమస్యలు పట్టించుకోకుండా.. నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వినోదాలు జరుపుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉట్నూర్ ఐటీడీఏ అధికారి రాంబాబు తన ఛాంబర్ లో జరుపుకున్న జన్మదిన వేడుకల్లో డీడీ సంధ్యారాణి, వైటీసీ జేడిఏం నాగబూషణం, హార్టికల్చర్ అధికారి రమణ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ భీంరావ్ లతో పాటు కార్యాలయ సిబ్బంది సైతం పాల్గొనడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయంపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేష్ మాట్లాడుతూ… ఆదివాసీ గిరిజనులకు సేవలందించాల్సిన ఐటీడీఏ అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.. వినోదాలకు పని చేయాల్సిన సమయాన్ని వృథా చేయడం సరి కాదన్నారు. తమ వినోద కార్యక్రమాలు ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరుపుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యార్థుల శిక్షణ కేంద్రాల్లో జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి పట్ల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed