- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి ఏటీఎంలో ఆ పనిచేసిన ఆగంతకులు.. దానికోసమేనా..?
దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో గల ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఏటీఎం మెషిన్ కి నిప్పుపెట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్ పూర్తిగా దగ్దమైంది. మంటలను గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబైలోని యాక్సిస్ బ్యాంకు కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆగంతుకులను పట్టుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆగంతకులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో ఏటీఎం దగ్ధం చేశారా..? మరేదైనా కారణమా..? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది.