- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురువుల స్థానం ఎంతో ఉన్నతమైనది
దిశ,తుంగతుర్తి : సమాజంలో గురువుల స్థానం ఎంతో ఉన్నతమైనదని సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది దేశాధినేతలు, ఉన్నత వర్గాలు, మేధోసంపత్తి కలిగిన వారంతా ఉపాధ్యాయుడి దిశానిర్దేశంలోనే కొనసాగినారని ఆమె వివరించారు. ఎంత ఎదిగినా, ఎందులో రాణించిన గురువులను పూజించడం మాత్రం మరవద్దని అన్నారు. కరోన సమయంలో విద్యారంగం కొంత వెనుకంజ వేసిందని, అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతున్నందువల్ల ఉపాధ్యాయులు ఆ లోటు భర్తీకి కృషి చేయాలని వివరించారు.
ఎంఈఓ బోయిన లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ గుండగాని కవిత, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, డీసీసీబీ, డీసీ ఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి, మాజీ ఎంపీపీ, సాహితీవేత్త తాటికొండ సీతయ్య, బండారు దయాకర్, విద్యావేత్తలు గుండగాని రాములు, యూటీఎఫ్, పీఆర్టీయూ, డీపీఎఫ్, ఎస్సీఎస్టీయూసీ, టీపీటీఎఫ్, టీఎస్పీటీఏ, ఎస్జీటీయూ సంఘాల బాధ్యులు వెలుగు రమేష్, ఎర్ర హరికిషన్, విజయ్ కుమార్, చింతకుంట్ల శ్రీనివాస్, చిత్తలూరి కర్ణాకర్, అనుముల శ్రీనివాస్, వీరస్వామి, తుంగతుర్తి, వెంపటి కాంప్లెక్స్‌ల ప్రధానోపాధ్యాయులు జి.భాస్కర్, మోతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.