ఖుష్బూ ఎదుట కోరిక చెప్పిన విద్యార్థి.. ఏ కాలేజీ అనడంతో పరార్..

by Shamantha N |
Cine actress Khushboo
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. బీజేపీ నుంచి థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో బరిలోకి దిగిన సినీనటి ఖుష్బూ.. వీధివీధి తిరుగుతూ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచార సమయంలో ఓ విద్యార్థి ఆమెను ఓ కోరిక కోరాడు. దీంతో ఆమె నీది ఏ కాలేజీ అని అడగడంతో అతడు సమాధానం చెప్పకుండా పరారీ అయ్యాడు. ఇంతకూ అంతడేం అడిగాడంటే..

తన కళాశాలలో సెమిస్టర్‌ పరీక్షలు రద్దు చేయించండి అని కోరగా, అందుకు ఆమె బదిలిస్తూ, కరోనా లాక్‌డౌన్‌ కాలంలో 9 నెలలు పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఎంజాయ్‌ చేశారుగా, ఇప్పుడు పరీక్షలు రాస్తే బావుంటుంది అంటూ సర్ది చెప్పారు. అందుకు ఆ విద్యార్థి, పాఠశాలల పరీక్షలు రద్దు చేసి ఆల్‌పాస్‌ ప్రకటించారని, కళాశాలలు మాత్రం ఆన్‌లైన్‌ తరగతుల పేరిట హింసిస్తున్నాయని మొరపెట్టుకున్నాడు. దీంతో ఖుష్బూ, ఏ కళాశాలలో చదువుతున్నావు అని అడగ్గా.. సమాధానం చెప్పకుండా ఆ యువకుడు తుర్రుమన్నాడు. దీంతో ఆ విద్యార్థికి చదువుకోవడం ఇష్టం లేక అలా అడిగి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story