తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

by Sumithra |
తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
X

దిశ, ఆర్మూర్: పొలం విషయంలో గొడవ పడిన కొడుకు తండ్రిపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఆదివారం మాక్లూర్ మండలంలోని గాలిబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్య శ్రీనివాస్(55) కొడుకు బుక్య విక్రమ్‌కు పొలం విషయంలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు విక్రమ్ తండ్రి శ్రీనివాస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రీకొడులిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story