- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులు.. దేవుళ్ళ కంటే ఎక్కువ.!
దిశ, నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లతో పాటు సర్వం కోల్పోయిన వారు సాక్షాత్తు దేవుళ్ళ కంటే ఎక్కువేనని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించేందుకు నూతన కాలనీకి శంకుస్థాపన చేశారు. ఎంపీ రాములుతో పాటు జడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నిర్వాసితులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా ఆకాశానికెత్తారు. కోట్ల రూపాయలు ఉన్నా కొంతమంది పిల్లికి కూడా బిక్షం వేయలేని వారు సమాజంలో ఉన్నారని, అలాంటిది ఇతరుల క్షేమం కోసం నిర్వాసితులు సర్వం ధారపోయడం ఎంతో గొప్ప విషయమన్నారు.
నిర్వాసితుల కోసం కడుతున్న కాలనీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెడతామన్నారు. బిజినపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన 485 మందికి 255గజాల చొప్పున ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ బాధితులకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వారి నిర్ణయం మేరకే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలనీలో ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలతో పాటు అదనంగా తన సొంత నిధుల నుండి రెండు నుండి మూడు కోట్ల వరకు అభివృద్ధికి ఖర్చు చేస్తానని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.