- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు చేసింది మూడెకరాలు.. దళితులకు ఇచ్చింది రెండెకరాలు
దిశ, కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘దళితులకు మూడెకరాలు భూమి’ కార్యక్రమం నీరుగారుతోంది. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం కాటపల్లి గ్రామానికి చెందిన జల్లే కాంతమ్మ, దైత లత, పోలేపాక కాంతమ్మ, సందేపాక శ్రావణిలను ఎస్సీ కార్పొరేషన్ నిరుపేదలుగా గుర్తించింది. మూడు ఎకరాల భూమి పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే, గ్రామంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన రావుల పుష్పలీల వద్ద ఒక్కొక్కరికి మూడెకరాల భూమి చొప్పున అధికారులు 12 ఎకరాలను కోటి రూపాలయలకు కొనుగోలు చేశారు. అనంతరం ఆ భూమిని ముగ్గురు దళిత మహిళలకు పంపిణీ చేశారు.
అయితే, ఆ భూమిని రావుల పుష్పలీల కుమారుడు విజయపాల్ రెడ్డి దళితుల వద్ద నుంచి నాలుగెకరాలు దౌర్జన్యంగా లాక్కున్నారు. దీంతో బాధిత మహిళలు చేసేదేంలేక వారికి మిగిలిన రెండు ఎకరాల భూమిలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నట్లు వాపోయారు. అంతేగాకుండా.. తమవద్ద నుంచి లాక్కున్న భూమిని జయపాల్ రెడ్డి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. దళితులకు అందాల్సిన మూడు ఎకరాల భూమిలో కొంతమంది అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వానికి సుమారు 34 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మూడు ఎకరాలు ఇవ్వాలి : లత, లబ్ధిదారులు
మాకు ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమికి హద్దులు చూపించాలి. ప్రస్తుతం మేము ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాము. దౌర్జన్యంగా కొందరు మా వద్దనుంచి తలో ఎకరం లాక్కున్నారు. ప్రస్తుతం మా వద్ద రెండెకరాల భూమి మాత్రమే ఉంది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
రెండెకరాలకే పట్టాలు : కాంతమ్మ, పోలేపాక లబ్ధిదారులు
దళితులకు మూడెకరాల భూమి రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నప్పటికీ. మాకు మాత్రం రెండు ఎకరాలకే పట్టాలు ఇచ్చారు. నలుగురు లబ్ధిదారుల నుండి నాలుగు ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు లాక్కున్నారు. అంతేగాక ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాకు న్యాయం చేయాలి.
దళితులకు అన్యాయం చేయడం సరికాదు : జల్లే కాంతమ్మ, లబ్ధిదారులు
దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం మాకు రెండెకరాలు ఇవ్వడం సరికాదు. ప్రభుత్వ భూమి కొనుగోలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు. లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. సుమారు 32 లక్షల రూపాయలు గోల్‌మాల్ అయ్యాయి.