ఆ వైద్యుడి నిర్వాకం తెలిస్తే నోరెల్లాబెడుతారు

by Anukaran |   ( Updated:2020-07-12 02:51:11.0  )
ఆ వైద్యుడి నిర్వాకం తెలిస్తే నోరెల్లాబెడుతారు
X

భోపాల్: ఓ వైద్యుడి చేసిన నిర్వాకం తెలిస్తే మీరు నిజంగా నోరెల్లాబెడుతారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన అతడి నిర్వాకం కారణంగా అతడిపై కేసు నమోదైంది. విషయమేమిటంటే.. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి జూన్ 23న కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత జూలై 1న తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇతనికి పై అధికారులకు సెలవులు ఇవ్వలేదు. కానీ, యూపీ వెళ్లి వచ్చాడు. అయితే అతను నిబంధనల ప్రకారం హోంక్వారంటైన్ లో ఉండాలి. కానీ, అతను ఏకంగా విధులకు హాజరయ్యాడు. అయితే తన భార్యలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ఈ సమయంలో ఓ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన భార్య పేరు మీద కాకుండా ఇంటి పని మనిషి పేరు మీద శాంపిళ్లను టెస్టింగ్ కు పంపించాడు. తాను యూపీ వెళ్లి వచ్చిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఈ ఉపాయానికి పాల్పడ్డాడు. ఆ టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే అధికారులు డాక్టర్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వైద్యుడి మోసం బయటపడింది. దీంతో అతడితోపాటు కుటుంబ సభ్యులకు టెస్టులు చేయగా అతడితోపాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు ఆ వైద్యుడి కారణంగా అతడి కార్యాలయంలో పనిచేసే 33 మంది సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. ఆ వైద్యుడిపై ఎపిడమిక్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Advertisement

Next Story