- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతటా ఒకలా.. ఇక్కడ ఇలా!
దిశ, రంగారెడ్డి:
కష్టమొచ్చింది…. అయినా కూడా వారందరూ ప్రభుత్వం సూచించిన విధంగా పాటిస్తూ వస్తున్నారు. కానీ, నిజానికి వారిది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆదుకుంటామని తెలిపి.. ఆ దిశగా అడుగులేస్తోంది. ఇక్కడ మాత్రం ఆలస్యమవుతోంది. దీంతో వారందరిలో అయోమయ వాతావరణం నెలకొన్నది. అదేవిధంగా.. మీరు అర్హులు కారు.. ఆ అవకాశం ఎక్కడలేదంటారోనని మరోవైపు మరికొంతమంది ఆందోళనలో చెందుతున్నారు. అదేమిటో మీరే చూడండి.
కరోనాతో పేదలకు కష్టాలు వచ్చాయి. రోజు కష్టపడితే గానీ పూటగడవని పరిస్థితితో కొట్టుమిట్టాడే జనం జిల్లాలో ఉన్నారు. బతుకుదెరువు కోసం రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల్లో జీవనం సాగిస్తున్నారు. వీరందరూ ఈ పరిస్థితిలో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం రేషన్ షాపులో నిత్యావసర సరుకుల అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రేషన్ షాపులకు బియ్యం అందించారు.. అవి పంపిణీ కూడా జరుగుతోంది. కానీ, కొన్ని షాపులకు బియ్యం ఇంకా చేరుకోలేదు. దీంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇటు అర్బన్ లోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం, అధికారులు, డీలర్లు అయోమయంలో ఉన్నారు.
వీరికి పరిష్కారం ఉందా…?
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా నేపథ్యంలో రేషన్ బియ్యం పంపిణీ పై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాల్లో 21 గ్రామీణ, 6 పట్టణ ప్రాంతలున్నాయి. అయితే.. నగరంలో అంతర్భాగంగా 6 మండలాల్లోని ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కష్టమేనంటున్నారు అధికారులు. ఎందుకంటే.. ప్రజలు ప్రభుత్వం చెబుతున్న సూచనలు పాటిస్తారా లేదా అనే అనుమానం ఒకటి కాగా, కావాలనే ప్రజలు బయటికి వచ్చే అవకాశం అధికంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. రేషన్ దారులకు సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
దరఖాస్తులు పెండింగులో..
జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం 83,966 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీరికి రేషన్ సరుకులు అందవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 919 రేషన్ షాపుల్లో 6,23,816 కుటుంబాలకు మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారు. నూతన దరఖాస్తుల కోసం గతంలో ఉన్న రేషన్ కార్డులో పేర్లను తొలగించుకున్నారు. కొత్తగా పెండ్లి చేసుకున్న కుటుంబాలు, అడ్రస్, పిల్లల పేర్లు జత చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి కార్డులు హోల్డ్ లో ఉన్నాయి. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. తమకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags: Rangareddy, ration shops, ration lanes, agitations, delays, officials