కరోనా సెలవుల్లో ప్రేమించుకున్న అక్కాతమ్ముడు.. మామిడి తోటకు వెళ్లి..

by Sumithra |   ( Updated:2021-05-06 02:25:38.0  )
కరోనా సెలవుల్లో ప్రేమించుకున్న అక్కాతమ్ముడు.. మామిడి తోటకు వెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ.. ఈ కాలంలో ఎవరి మధ్య పుడుతుందో ..? ఎప్పుడు పుడుతుందో అర్ధం కావడం లేదు. వావి వరసలు మరిచి యువత ప్రేమ మోజులో చేసే తప్పులు వారి తల్లిదండ్రుల పరువును రోడ్డున పడేలా చేస్తున్నాయి. ప్రేమించడం తప్పు కాదు.. కానీ వావివరసలు మరిచి ప్రేమించడం తప్పు. తాజాగా ఓ యువతీ సొంత బాబాయ్ కొడుకును ప్రేమించింది. ప్రేమతో ఆపకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతడితో కలిసి వెళ్ళిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, తన సొంత బాబాయ్ కొడుకు, వరసకు తమ్ముడు అయ్యే యువకునితో ప్రేమలో పడింది. కరోనా కారణంగా కాలేజ్ కి సెలవులు కావడంతో యువకుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని బయటకు వెళ్లడం మొదలుపెట్టింది.

అక్కా, తమ్ముడే కదా అని ఎవరు వారిని పట్టించుకోలేదు. ఇలా కొన్నిరోజులు సాగిన వీరి ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలనుకొనేవరకు వచ్చింది. విషయం తెలిస్తే ఇంట్లో ఒప్పుకోరని అనుకున్న ఈ అక్కాతమ్ముళ్లు ఇంట్లోనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లపోవడానికి ప్లాన్ వేసింది. తమ్ముడిని ఇంటికి రప్పించి ఇంట్లో ఉన్న నానమ్మకు తమ్ముడితో కలిసి మామిడి తోటకు వెళ్తున్నా అని అబద్దం చెప్పి అతడితో వెళ్ళిపోయింది. సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురికోసం ఆరాతీయగా తమ్ముడితో కూతురు వెళ్లిపోయిందని తెలిసి కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కాతమ్ముళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story