కేరళలో మరో వింత వ్యాధి.. నిర్ధారించిన భోపాల్ ఇనిస్టిట్యూట్..

by Anukaran |   ( Updated:2021-12-09 23:28:29.0  )
కేరళలో మరో వింత వ్యాధి.. నిర్ధారించిన భోపాల్ ఇనిస్టిట్యూట్..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ఇంకా చల్లబడక ముందే కేరళకు మరో సమస్య స్వాగతం పలుకుతోంది. ప్రపంచం మొత్తం ఒమెక్రాన్ నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నాలు చేస్తుంటే, కేరళీయులకు మాత్రం కొత్త ఫ్లూ బెడద పట్టుకుంది. ఇప్పుడు మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో పినరయ్ సర్కార్ కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. అలప్పుజా ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో స్థానికుల్లో ఆందోళనలు మొదలు అయ్యాయి.

శాంపుల్స్ ను పరీక్షించిన భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థ ఈ వ్యాధి బర్డ్ ఫ్లూ గా నిర్దారించింది. వారం రోజులుగా రాష్ట్రంలో కోళ్లు , బాతులు, పక్షులు విపరీతంగా మరణిస్తుండటంతో పశుసంవర్దక శాఖ నమూనాలు సేకరించి భోపాల్ పంపింది. బర్డ్ ఫ్లూ కారణంగానే ఇలా జరిగిందని నిర్ధారణ జరిగింది. పక్షుల పెంపకపు దారులకు నష్టపరిహారం చెల్లించి, కోళ్లు, బాతులు, పక్షులను నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed