‘ప్రజల ఆశీర్వాదంతో కేటీఆర్ త్వరగా కోలుకుంటారు’

by vinod kumar |
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రముఖులు సైతం రోజుకొకరు మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా.. మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు్న్నారు. తాజాగా.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్‌లు స్పందించారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, ఆ భగవంతుడి దీవెనలతో మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story