- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
దిశ,వెబ్‌డెస్క్ : తెలంగాణలో గత వారం రోజులుగా రుతుపవనాల జాడ లేకుండా పోయింది. వారం రోజుల క్రితం వర్షాలు కురవడంతో రైతులు పొలం పనులు మొదలు పెట్టారు. పత్తి, మక్కజొన్న విత్తనాలు విత్తారు. కానీ ఆతర్వాత రుతుపవనాలు మందగించి వర్షాలు పడటం తగ్గి క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ రైతులకు శుభవార్తను అందించింది. జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. అలాగే ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో పశ్చిమ, వాయువ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి కారణంగా ఆదివారం(రేపు) తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.