కరోనాతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి.. కూతురు చేసిన పనికి కన్నీళ్లు ఆగవు

by srinivas |   ( Updated:2023-05-19 10:05:38.0  )
man died
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చి కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయులను చేస్తోంది. తాజాగా.. కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి ఓ కూతురు తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తట్టుకోలేక వెళ్లి తండ్రి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన కన్నుమూశారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44), విజయవాడలో కూలి పనులు చేస్తూ.. జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల స్వల్ప లక్షణాలతో కరోన నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది.

అనంతరం అనుమానంతో టెస్టులు చేయించుకున్న కుటుంబసభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. కల్లంలో ఉండగా, ఒక్కసారిగా అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన్ను గమనించిన భార్యాకూతురు దగ్గరకు వెళ్లలేకపోయారు. కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా.. కూతురు తండ్రిమీద ప్రేమను చంపుకోలేక వెళ్లి ఆయన గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే ఆయన తుదిశ్వాస విడిచాడు. విషయం తెలిసిన గ్రామస్తులు ఆయన బతికి ఉండగానే ఘటనా స్థలికి వచ్చినా.. ఎవరూ ఏం చేయలేకపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయ

Advertisement

Next Story