నదిలో చేపల పట్టడానికి వెళ్లిన వ్యక్తి గల్లంతు

by Aamani |
Santhosh
X

దిశ, బెజ్జుర్ : పెన్ గంగా నదిలో ఒకరు గల్లంతైన సంఘటన శనివారం కౌటాల మండలంలో చోటు చేసుకుంది. కౌటాల ఎస్ఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. తాటిపెల్లి గ్రామానికి చెందిన ఇప్ప సంతోష్ (36) శనివారం గ్రామ సమీపంలో ఉన్న పెన్ గంగ నది వద్దకు వెళ్లాడు. అక్కడ చేపల పట్టేందుకని నాటు పడవలు నదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో సంతోష్ నదిలో గల్లంతయ్యాడు. అతడి కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కాగా నదిలో గల్లంతయిన సంతోష్‌కు భార్య లావణ్య ఉన్నది.

Advertisement

Next Story