వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పట్టాలపై పరుగులు తీసిన సీఐ

by Aamani |   ( Updated:2021-08-11 08:07:28.0  )
CI lingamurthy
X

దిశ, మంచిర్యాల: ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఓ వ్యక్తిని కాపాడేందుకు మంచిర్యాల పోలీసులు ప్రాణాలకు తెగించారు. ఏకంగా రైలు పట్టాలపై పరుగులు తీసి, అతన్ని కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల పోలీస్ స్టేషన్‌కు మంగళవారం సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మా అన్నయ్య రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దయచేసి కాపాడండి’’ అంటూ 100కు డయల్ చేసి చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐ లింగమూర్తి, ఎస్ ప్రవీణ్ కుమార్‌లు లొకేషన్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించారు. అనంతరం పట్టాలపై పడుకొన్న వ్యక్తిని పరుగులు తీసి కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఈ సందర్భంగా సీఐ లింగయ్య మాట్లాడుతూ… కుటుంబ సమస్యలను కూర్చొని పరిష్కరించుకోవాలని, ప్రతిదానికీ చావే మార్గం కాదని అన్నారు.

Advertisement

Next Story