కారు బైక్ ఢీ.. వ్యక్తి మృతి

by Sumithra |
కారు బైక్ ఢీ.. వ్యక్తి మృతి
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని లోతుకుంట గ్రామానికి చెందిన జాని (28) సొంత పని నిమ్మితం భువనగిరి వెళ్లి తిరుగి వస్తున్నాడు. ఈ క్రమంలో భువనగిరి వైపు వెళుతున్న కారు ఓవర్టేక్ చేసే గ్రామంలో బైక్ ను ఢీ కొట్టింది.

దీంతో కింద పడిపోయిన జానిపై నుంచి వెనుకల వస్తున్న మరో కారు వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story