- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుందరీకరణ పనుల్లో లోపించిన నాణ్యత
by Shyam |
X
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : తుర్కయంజాల్ మాసాబ్‌చెరువు సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయి. రూ.10కోట్లకు పైగా వ్యయం వెచ్చించి చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ల అలసత్వం కనబడుతోంది. నాగార్జునసాగర్ రహదారికి ఆనుకున్న మాసాబ్‌చెరువును ఆధునీకరించి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పం నీరుగారేలా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే కట్టపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ కుంగిపోవడంతో విమర్శలు రెట్టింపయ్యాయి. పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు సుందరీకరణ పనులు హెచ్ఎండీఏ అనుమతులతో సాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
Advertisement
Next Story