- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్..
దిశ, వెబ్‌డెస్క్ : ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ వివాదంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీజే జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. అయితే, విచారణ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రిని పూర్తిగా కూల్చి కొత్తగా ఆసుపత్రిని నిర్మిస్తారా.? లేక.. కొన్ని బ్లాక్‌లు నిర్మిస్తారా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్.. హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకునేందుకు ఎన్నేళ్లు కావాలని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం తీరు దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దని కోర్టు ప్రశ్నించింది. విచారణలో భాగంగా ఆసుపత్రి నిర్మాణంపై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూ ప్రింట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.