తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రియ‌

by Shyam |   ( Updated:2021-09-14 06:00:30.0  )
heroin
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ హీరోయిన్ శ్రియ త‌న భ‌ర్త ఆండ్రీ కొశ్చేవ్‌తో క‌లిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులు . వారికి ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంత‌రం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా రోజులుగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, గమనం సినిమాల్లో నటిస్తున్నట్లు శ్రియ వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా శ్రియకి ఆమె భ‌ర్త ఆండ్రీ కొశ్చేవ్ ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story