ఈసారైనా ఆ హీరో హిట్ కొట్టేనా..?

by Shyam |
ఈసారైనా ఆ హీరో హిట్ కొట్టేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా సినిమాకు డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటున్నా.. ఈ కుర్ర హీరోకు విజయాలు వరించడం లేదు. వరసపెట్టి ప్లాపులు మూటకట్టుకున్నాడు. కేరీర్ ప్రారంభంలో డీసెంట్ గా కనిపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు టాలీవుడ్ యువ న‌టుడు నాగశౌర్య. ఈ ఏడాది అశ్వ‌త్థామ చిత్రంతో ఆడియెన్స్ ను ప‌లక‌రించిన ఈ యంగ్ హీరో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇప్పుడు ట్రెండ్ మార్చి డిఫ‌రెంట్ లుక్స్ ట్రై చేస్తూ మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు నాగశౌర్య.

నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం విలువిద్య నేపథ్యంలో రూపొందుతుండగా ఈ సినిమాలో నాగశౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తునారు. హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడట నాగ శౌర్య. ఇక ఇప్ప‌టికే అనీష్ కృష్ణ డైరెక్ష‌న్ లో వరుడు కావ‌లెను మూవీతోపాటు శ్రీనివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నాగశౌర్య.

Advertisement

Next Story

Most Viewed