‘రైతులు వారిని నమ్మి మోసపోకండి..’

by Aamani |   ( Updated:2021-10-23 00:44:33.0  )
‘రైతులు వారిని నమ్మి మోసపోకండి..’
X

దిశ, నందిపేట్: నందిపేట్ మండలంలోని మాయపూర్ గ్రామంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా పీఏసీ యస్ చైర్మన్ బొంకం. చిన్న గంగారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోస పోవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాలవద్దనే విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగిందని, వేరే రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి అవకాశం లేనందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వరి ధాన్యానికి క్వింటాలుకు ఏ గ్రేడ్‌కు 1960 బీగ్రేడ్ కు 1940 మద్దతు ధర ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బొంకం చిన్న గంగారెడ్డి, వైస్ చైర్మన్ తేలు నర్సయ్య, డైరెక్టర్ సుధాకర్, సీ ఈ ఓ నారాయణ్, సీ ఓ ఏ ఓ అబ్దుల్ నర్సయ్య ప్రజాప్రతినిధులు, వీ డీసీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story