యాసిడ్ దాడులు: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం 

by Anukaran |
యాసిడ్ దాడులు: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం 
X

దిశ, వెబ్ డెస్క్: యాసిడ్ దాడులను అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ మంత్రుల మండలి యాసిడ్ దాడి చేసిన వారిపై క్రిమినల్ నేరం, క్రిమినల్ ప్రొసీజర్ చట్టాన్ని సవరించి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. యాసిడ్ బాధితులు చనిపోయిన పక్షంలో 20 ఏళ్ళ జైలు, ఒక మిలియన్ పెనాల్టీ విధించేలా ఆర్డినెన్స్ కు రూపకల్పన చేసింది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, యాసిడ్ దాడికి పాల్పడేవారికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. యాసిడ్ దాడి కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే… నేరస్థుడికి జీవిత ఖైదు పడేలా ఆర్డినెన్స్ రూపొందించింది. అలాగే యాసిడ్ బాధితుడు గాయపడినా, శరీర భాగాలు దెబ్బతిన్నా… దాడికి పాల్పడిన వ్యక్తికిసవరించిన ఆర్డినెన్స్ ద్వారా 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1 మిలియన్ జరిమానా విధించబడుతుంది.

Advertisement

Next Story