జానీ మాస్టర్‌‌కు ఊహించని షాక్.. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్‌ దాఖలు

by Mahesh |
జానీ మాస్టర్‌‌కు ఊహించని షాక్.. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్‌ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుట్ స్టార్ కొరియోగ్రాఫర్(Choreographer) జానీ మాస్టర్‌(Johnny master)కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసు(sexual harassment case)లో కోర్టుకు వెళ్లిన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. అనంతరం కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన.. తన కొరియోగ్రాఫర్ వృత్తిలో బిజీగా మారారు. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. లైంగిక వేధింపుల కేసులో మరోసారి కదలికలు మొదలయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా మరో ఛార్జిషీట్‌‌(Charge sheet)ను పోలీసులు(Police) దాఖలు చేశారు. అందులో లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడి(sexual assault) చేసినట్లు నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈవెంట్స్‌ పేరుతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లిన సమయాల్లో యువతిపై అక్కడే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తమ తాజా ఛార్జిషీట్‌ తేల్చేశారు. దీంతో అంతా ముగిసి పోయిందనుకున్న సమయంలో మరోసారి జానీ మాస్టర్ కు షాక్ తగిలిందనే చెప్పుకొవాలి.

Advertisement

Next Story

Most Viewed