ప్రేమతత్వం పంచిన కరుణామయుడు యేసు : నాగర్ కుంట నవీన్ రెడ్డి

by Aamani |
ప్రేమతత్వం పంచిన కరుణామయుడు యేసు :  నాగర్ కుంట నవీన్ రెడ్డి
X

దిశ,కొందుర్గు : విశ్వ మానవాళికి తన ప్రేమతత్వం తో ప్రజల జీవితాలలో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని,దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకోవాలని, అదే క్రిస్మస్ పండుగ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. మండల కేంద్రంలోని హెబ్రోన్ చర్చి ,మెథడిస్ట్ చర్చి లో నిర్వహించిన క్రిష్టమస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ మానవ జాతి మనుగడ సాధించడానికి శాంతి సహనం, ఎదుటివారికి సహాయపడాలనే ఏసుక్రీస్తు ప్రబోధనలు మనకు ఆచరనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ , జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ,దర్గా రాంచంద్రయ్య,రవిందర్ రెడ్డి,శివాచారీ,మానయ్య,సుందర్ ,సచిన్,గంట్ల రాజు,కొత్త రాజు,పెంటయ్య,రత్నయ్య,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed