ఆధార్ పై ఉడాయ్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాళ్లకు కూడా ..

by Anukaran |
ఆధార్ పై ఉడాయ్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాళ్లకు కూడా ..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రతి పౌరుని గుర్తింపుకు ఆధార్ ప్రధానం అయిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 99.8 శాతం ప్రజలకు ఉడాయ్(UIDAI) ఆధార్ కార్డులను జారీ చేసింది. అయితే దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు రెండున్నర కోట్ల మంది నవజాత శిశువులు జన్మిస్తున్నారు. వారికి కూడా ఆధార్ ఇవ్వాలని ఇప్పుడు ఉడాయ్ ఆలోచిస్తోంది. అయితే ఇందుకోసం ఆయా ఆసుపత్రులలోనే ఏర్పాట్లు చేయనున్నట్టు ఉడాయ్ సీఈఓ సౌరభ్ గార్గ్ ప్రకటించారు. ఇలా ఆధార్ ఇవ్వడానికి రిజిస్టార్ ఆఫ్ బర్త విబాగంతో చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఆధార్ కార్డు ఇవ్వాలంటే పిల్లలకు వేలి ముద్రలు పడవు. దాంతో పిల్లల ఫోటోను ఆస్పత్రిలోనే తీసి ఆ ఆధార్ కు తల్లి లేదా తండ్రి ఆధార్ తో అనుసంధనం చేస్తారు. ఐదేళ్ల తర్వాత ఆ ఆధార్ ను బయోమెట్రిక్ తో అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం ఒకే ఒక్క క్లిక్ తో ఆధార్ కార్డ్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఈఓ ప్రకటించారు. భారతీయుల గుర్తింపుకోసం ఆధార్ ను ప్రపంచ దేశాలు అనుమతించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ బ్యాంక్, ఐఖ్యరాజ్య సమితి తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు వివరించారు. అది సక్సస్ అయితే డిజిటల్ ఐడెంటిటీ లా ఆధార్ ఉపయోగ పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed