TG Assembly: మాకు రైతులతో ఉంది భావోద్వేగ బంధం.. సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్

by Shiva |
TG Assembly: మాకు రైతులతో ఉంది భావోద్వేగ బంధం.. సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తమకు మధ్య ఉంది భావోద్వేగ బంధమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఆసెంబ్లీ (Assembly)లో ‘రైతు భరోసా’ (Raithu Bharosa)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మొదటి విడతలో భాగంగా రూ.6,034 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మొత్తం 27 రోజుల్లో మూడు విడతల్లో రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20,616 కోట్ల రుణ మాఫీ చేసిన ఘటన తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కడుపుకట్టుకుని రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ (BRS) పార్టీకి లేదని ఫైర్ అయ్యారు. తమకు రైతులకు ఉంది భావోగ్వేగ బంధమని తెలిపారు. రుణమాఫీ చేసేందుకు తమ వద్ద నల్ల డబ్బు లేదంటూ గతంలో కేసీఆర్ (KCR) అన్నారని గుర్తు చేశారు. అదానీ (Adani)కి తిరిగిచ్చిన రూ.100 కోట్లతో రాష్ట్రానికే నష్టమని.. తనకు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed