Nara Lokesh:గల్ఫ్‌లో చిక్కుకొని మహిళ ఆవేదన.. స్పందించిన మంత్రి లోకేష్

by Jakkula Mamatha |
Nara Lokesh:గల్ఫ్‌లో చిక్కుకొని మహిళ ఆవేదన.. స్పందించిన మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్నీ అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్నీ ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్న తర్వాత ఆమె యజమాని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు.

యజమాని పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్(X) ద్వారా మంత్రి లోకేష్‌ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. తన టీం ద్వారా షేక్ మున్నీని క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తమ సమస్యను ఎక్స్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి.. మంత్రి లోకేష్ చేసిన సాయం పట్ల బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed