- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: మూడున్నర ఏళ్లు చాలా చాలా కష్టపడ్డాము.. రామ్ చరణ్ కామెంట్స్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ (Sankranti Special)గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ (Promotions)లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాంగంగా అమెరికా (America)లోని డల్లాస్ (Dallas)లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు (Dil Raj) తదితరులు అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘సంక్రాంతి మాకు చాలా స్పెషల్. చాలా మందికి తెలియదు కానీ.. ఈ మూవీ స్టార్ట్ అయ్యి దాదాపు మూడున్నర ఏళ్లు (Three and a half years) పైనే అవుతోంది. నా బ్రదర్ తారక్ (Tarak)తో ‘RRR’ చేసిన తర్వాత.. వెంటనే ‘గేమ్ చేంజర్’ స్టార్ట్ చేశాము. ఈ సోలో ఫిలిమ్ నేను చేసి నాలుగు సంవత్సరాలు కావొస్తుంది. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాము. శంకర్ స్టైల్ అయితే వండర్ అనే చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చెయ్యదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ రాగా.. సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.