రవాణా శాఖలో డిటీసిలు, జేటీసిలుగా పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ

by Mahesh |
రవాణా శాఖలో డిటీసిలు, జేటీసిలుగా పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా శాఖ(transport department)లో డిటీసిలు, జేటీసిలుగా పదోన్నతులు(Promoted) పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు‌(Joint Transport Commissioners)గా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, ఐ.టి జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా, శివలింగయ్య కు అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్‌ను ఆదిలాబాద్ డిటిసిగా, ఎన్. వాణి ని నల్గొండ డిటిసిగా, అఫ్రీన్ సిద్దిఖీ ని కమిషనర్ కార్యాలయంలో డిటిసిగా, కిషన్ ను మహబూబ్ నగర్ డిటిసిగా, సదానందంకు రంగారెడ్డి డిటిసిగా పోస్టింగ్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed