మంత్రి కొండా సురేఖను కలిసిన బీర్ల ఐలయ్య

by Aamani |
మంత్రి కొండా సురేఖను కలిసిన బీర్ల ఐలయ్య
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై చర్చించారు. దేవస్థాన కళ్యాణ కట్ట లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను దేవస్థానం ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. దేవస్థాన కళ్యాణకట్టలల్లో పనిచేస్తున్న 96 మందిలో 63 మంది పురుషులు, 33 మంది మహిళలను ఆలయ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చి, వారికి ఉచిత వైద్య సదుపాయాలు, ఆరోగ్య బీమా,జీవిత బీమా కల్పించాలని కోరారు.

Advertisement

Next Story