మొరం అక్రమంగా తరలింపు..

by Aamani |
మొరం అక్రమంగా తరలింపు..
X

దిశ, కమ్మర్ పల్లి: ఇటీవల కాలంలో కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండల పరిధిలో గల వరద కాలువ గుట్టపై ఉన్న మొరాన్ని కొందరు అడ్డు అదుపు లేకుండా తరలిస్తున్నప్పటికీ తమకు ఏమీ పట్టనట్లుగా ఆయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కమ్మర్ పల్లి, మోర్తాడ్ మండల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా జెసిబి లతో తవ్వి, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శలు వినబడుతున్నాయి.

అక్రమార్కులు విలువైన మొరాన్ని అక్రమంగా ఇంటి పునాదులు నింపటానికి కూడా ఉపయోగిస్తున్నారు. రాత్రి సమయంలో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. దీని వెనుక ఆయా శాఖకు చెందిన కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరద కాలువ మట్టిని ప్రభుత్వ పనులకు ఉపయోగించాలి, కానీ అక్రమార్కులు మొరాన్ని తరలించి లక్షలాది రూపాయలు అక్రమంగా దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ పై అధికారులు స్పందించి అక్రమ మోరం తరలింపుకు చెక్కు పెట్టుతారని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story