- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
దిశ, మేడిపల్లి: గంజాయి విక్రాయిస్తున్న వ్యక్తిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బోడుప్పల్, చెంగిచర్ల, చర్లపల్లి, చక్రిపురం తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తుండగా చర్లపల్లి ప్రధాన రహదారి పారిశ్రమిక ప్రాంతంలో శ్రీకృష్ణ కన్వెన్షన్ ఎదురుగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నేరెడ్ మేట్ తిరుమలగిరి కి చెందిన చందన (37) యాక్టివా వాహనంలో 2 కిలోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్ లో నివసిస్తూ తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ నుంచి గంజాయిని తీసుకు వచ్చి కాప్రా పరిసరాల ప్రాంతాలలో అమ్ముతానని తెలిపాడు. అతని నుండి రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో సీఐ జూపల్లి రవి, ఎస్ఐ లు నందిని, సంగీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.