- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నూతన సంవత్సరంలో ఉద్యోగులు సమిష్టి కృషితో జిల్లాకు మంచి పేరు తేవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
దిశ,కామారెడ్డి : నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి కృషితో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... జిల్లాను అన్ని రంగాల్లో ప్రప్రథమంగా నిలిపేందుకు ఉద్యోగులు సమిష్టి కృషి చేయాలన్నారు. గత 2024 సంవత్సరంలో ఉద్యోగుల సహకారంతో మంచి పేరు సంపాదించామని, అదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో ప్రతిభను సంపాదించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరుచుటలో ప్రతి ఉద్యోగి భాగస్వాములు కావాలన్నారు.
దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలతో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచ్చామని, రబీలో కూడా వరి సేకరించి ప్రథమంలో నిలవాలన్నారు. సన్న వరి కొనుగోళ్లలో క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించి 50 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామన్నారు. గత సంవత్సరం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు చేపట్టి నాణ్యమైన వసతి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని, ఆ చర్యల వలన విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర పర్యటన లో వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు తనిఖీ చేయాలన్నారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలను పరిశీలించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో, పథకాల అమలులో త్రికరణ శుద్ధిగా పని చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అమలు పరచాలన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో పని చేయాలని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ బాధ్యతను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.
ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించామని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రవాణా శాఖ వారిచే తయారు చేసిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బ్లాంకెట్ లు అందజేసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఒ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.