- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kitchen Tips : లవంగాలను ఇలా వాడితే చాలు.. దెబ్బకు ఎలుకలు పరార్!
దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఎలుకలు ఉండటమనేది ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా వివిధ ఆహార పదార్థాలను, దస్తులను, వస్తువులను అవి పాడు చేస్తుంటాయి. పుస్తకాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను కొరికేస్తుంటాయి. దీంతో కొందరు ఎలుకల బెడద తట్టుకోలేక బోనులు వాడుతుంటారు. అయినా వాటిని అడ్డుకోలేం. అయితే లవంగాల చిట్కాతో ఎలుకల సమస్యను ఎదుర్కోవచ్చు అంటున్నారు చిట్కా నిపుణులు. ఎలాగో చూద్దాం.
*లవంగాల ఘాటైన వాసన ఎలుకలకు పడదట. కాబట్టి అవి క్యాబినెట్, డ్రాయర్, షెల్ఫ్ వంటి ఏరియాల్లో వస్తువులను, దుస్తులను పాడు చేయకుండా ఉండాలంటే.. అక్కడ లవంగాలను ఉంచితే చాలు.
*ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువైతే లవంగాల స్ర్పేను చల్లవచ్చు. ఇందుకోసం ఒక స్ర్పే బాటిల్‌లో లవంగం నూనె, నీళ్లు మిక్స్ చేయాలి. లవంగం నూనె అందుబాటులో లేకుంటే లవంగాలను నూనెలో ఉడకబెట్టడం ద్వారా వచ్చే నీటిని చల్లార్చి స్ర్పే బాటిల్లో నింపుకొని కూడా చల్లవచ్చు. దీనివల్ల ఎలుకలు పారిపోతాయి.
* ఒక బట్టలో కొన్ని లవంగాలు మూటలా కట్టి తలుపులు, కిటికీలు, ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయనుకునే ఏ ప్రదేశంలోనైనా సరే వాటిని ఉంచితే చాలు. ఆ వాసనకు ఎలుకలు రావు. లవంగం నూనె కాటన్ ముక్కపై లవంగం నూనె పూసి దానిని ఇంట్లో ఉంచినా వాసనకు ఎలుకలు అటువైపు రావు. ఎలుకలే కాదు, దీంతో పలు కీటకాలు కూడా రాకుండా ఉంటాయి.
Read More ....
Vegitables: ఈ 3 కూరగాయలు వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు