SSMB29 మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఏడాదిన్నరలో రాబోతోంది : రామ్ చరణ్

by Mahesh |   ( Updated:2025-01-02 15:48:07.0  )
SSMB29 మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఏడాదిన్నరలో రాబోతోంది : రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu), యూనివర్సల్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli) కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రారంబోత్సవ పూజా కార్యక్రమం(Pooja program) ఈ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పూజ కార్యక్రమం అనంతరం దర్శకుడు రాజమౌళి.. డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్‌ల గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అథిదిగా హాజరయ్యాడు. ఈ సందర్భం యాంకర్ సుమా.. హీరో రామ్ చరణ్‌(Hero Ram Charan)ను సరదాగా.. SSMB29 సినిమా విడుదల తేదీ గురించి అంచనా చెప్పమని కోరింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. కరోనా లాంటి పాండమిక్ లు అడ్డురాకుంటే.. ఏడాదిన్నరలో మహేష్ బాబు, రాజమౌళి సినిమా విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి స్పందిస్తూ కరెక్టుగా ట్రైన్ చేశారని నవ్వాడు. కాగా ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ రోజు ఉదయమే SSMB29 సినిమా పూజా కార్యక్రమం పూర్తయినప్పటికీ.. దీనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో మహేష్ బాబు అభిమానులు(Fans) పూజా కార్యక్రమానికి సంబంధించిన అప్ డేట్ పై ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

Read More ....

గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఎఫెక్ట్.. AMB సినిమాస్ దగ్గర భారీగా పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు


Advertisement

Next Story

Most Viewed