తెలంగాణలో తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన టెట్‌ పరీక్షలు

by Mahesh |
తెలంగాణలో తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన టెట్‌ పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత టెట్ (TG TET) పరీక్షలు ఇవాళ ఉదయం ప్రారంభం అయ్యాయి. కాగా మొదటి రోజు(first day) పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఉదయం పరీక్షకు 72.25శాతం మధ్యాహ్నం పరీక్షకు 75.68శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ టెట్ పరీక్షలు(Tet Exams) నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రోజుకు రెండు సెషన్లలో ఈ నెల 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో మొత్తం ఆరు రోజుల పాటు పేపర్- 2 పరీక్ష, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్‌-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెట్ నోటిఫికేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌-1కు 94,327 మంది, పేపర్‌-2కు 1,81,426 మంది అప్లయ్‌ చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed