- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టెట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
దిశ,నల్లగొండ: నేటి నుండి ఈనెల 20 వరకు నిర్వహిస్తున్న ఆన్లైన్ టెట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఉన్న ఎస్పిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ టెట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షకు కేటాయించిన అభ్యర్థులు, హాజరైన అభ్యర్థులు, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెట్ పరీక్ష నిర్వహణలో భాగంగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు 2 విడతల్లో ఆన్లైన్ ద్వారా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన పరీక్షను ఆమె తనిఖీ చేశారు.కాగా ఈ కేంద్రానికి 180 మంది అభ్యర్థులను కేటాయించగా, గురువారం నాటి ఉదయం పరీక్షకు 118 మంది హాజరైనట్లు నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.మొదటి రోజు జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట డీఈవో బిక్షపతి, తదితరులు ఉన్నారు.