సంకెళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన..

by Aamani |
సంకెళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన..
X

దిశ,కామారెడ్డి టౌన్ : సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 24వ రోజులో భాగంగా మున్సిపాలిటీ ముందు ధర్నా శిబిరం వద్ద అందరూ సంకెళ్లు వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. కావున మా సంకెళ్లను తెంచి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ తెగించి కొట్లాడితేనే విజయతీరానికి చేరుతామని అందరికీ మనోధైర్యాన్ని ఇచ్చారు. మహిళా అధ్యక్షురాలు వాసంతి మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసే వరకు సమ్మె లో కొనసాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, కాళిదాసు, శైలజ, సంతోష్ రెడ్డి, వనజ, మంగా, శ్రీవాణి, కళ్యాణ్, సంధ్య, లింగం, కృష్ణ, దినేష్,వీణ, లావణ్య 600 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed