సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎలాంటి సినిమా అయినా చేస్తా.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎలాంటి సినిమా అయినా చేస్తా.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) ‘కాంతార’ సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కాంతార-2’(Kantara 2)తో రిషబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే చత్రపతి శివాజీ(Chatrapati Shivaji), జై హనుమాన్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూడు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చాలా క్రేజీగా ఆలోచిస్తారు. మరెవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు మాత్రమే వస్తాయి.

అందుకే ఆయన తీస్తోన్న ఏ సినిమాలోనైనా నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి సినిమా అయినా చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి మా గ్రామాన్ని సినిమాటిక్‌ హబ్‌(Cinematic Hub)గా మార్చాలనే కల ఉండేది. ఇక్కడ అటవీ ప్రాంతంలో షూటింగ్‌లు చేయాలని కూడా కలలు కన్నాను. కాంతారలో చూపించాను. అప్పుడు నా కల నెరవేరింది. గ్రామానికి చెందిన 700 మంది ఈ సినిమాకు పని చేశారు. ఆ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed