చిన్నారులే వంట మాస్టర్లయిన వేళ

by Sridhar Babu |
చిన్నారులే వంట మాస్టర్లయిన వేళ
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ క్యాంపస్ లోని ప్రైమరీ పాఠశాలలో శనివారం పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిండ్లను తయారు చేసి ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

బాలబాలికలు బిర్యాని కూడా తయారు చేశారు. పులిహోర, చికెన్‌, మటన్‌ ఫ్రై, జొన్నరొట్టెలు, నువ్వుల లడ్డూలు, డబుల్‌కామీటా, మంచూరియా తదితర వంటకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయులు రామచంద్రం, దేవరాజు, సుజాత, రాజు, రమ్య, స్వరూప, హీరో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story