వాడుకున్నావ్.. పెళ్లి చేసుకో.. బ్యాండ్ మోగించి చెప్పిన ప్రియురాలు

by Sumithra |
Bandmelam
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. రెండేళ్లు కలిసి తిరిగాక ముఖం చాటేశాడు. ఇరు కుటుంబాలు ఓకే చెప్పినా.. ప్రియుడు ప్లేట్ పిరాయించడంతో యువతి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. డ్యాండ్ బాజాతో వెళ్లి లవర్‌ చేసిన మోసాన్ని ఢంకా మోగించి చెప్పింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గోరఖ్‌పూర్‌కు చెందిన యువతికి రెండేళ్ల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌లో అదే ప్రాంతానికి చెందిన సందీప్ మౌర్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మరింది. వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల్లో తెలిసింది. వారు కూడా అడ్డుచెప్పకపోవడంతో ఇద్దరు రెండేళ్లుగా కలిసి తిరిగారు. ఒకరి ఇంటికి మరొకరు వస్తూ పోతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇద్దరు శారీరకంగానూ కలిశారు.

అయితే కొద్దిరోజులుగా సందీప్ మౌర్య సైలెంట్ అయ్యాడు. ప్రియురాలి ఇంటికి రావడం మానేశాడు. ఆమెతో మాట్లాడటం కూడా బంద్ చేశారు. ఈలోగా వారి తల్లిదండ్రులు వేరే అమ్మాయిని చూసి పెళ్లికి అంతా సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న ప్రియురాలు స్నేహితులు, బంధువులతో కలిసి బ్యాండ్ మేళం ట్రూప్ బాజా వాయిస్తూ సందీప్ మౌర్య ఇంటికి వెళ్లింది. వారి ఇంటి ముందు బ్యాండ్ వాయిస్తూ రచ్చరచ్చ చేసింది.

తనను రెండేళ్లుగా ప్రేమించి, శారీరకంగా వాడుకుని మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీసింది. సందీప్ మౌర్య తల్లిదండ్రులను సైతం కడిగి పారేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా వినలేదు. పెళ్లి జరిగితే తనతోనే జరగాలని, లేకపోతే సందీప్ మౌర్య ఊచలు లెక్కపెట్టాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో ఆమెతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సందీప్ మౌర్యపై కేసునమోదు చేశారు.

Advertisement

Next Story