భారత్‌లో నాలుగవ ఒమిక్రాన్ కేసు.. ఎక్కడో తెలుసా..?

by Anukaran |
corona
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ నాలుగవ కేసు నమోదయ్యింది. సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రకి చేరుకున్న ప్రయాణికుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యక్తి ట్రావెల్ హిస్టరీ ప్రకారం దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ వెళ్లాడని అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా ముంబయికి చేరుకున్నట్లు పీటీఐ(ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులను కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తిస్తున్నారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఎంటర్ కావడంతో మహా సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలంటే రెండు డోసుల టీకాతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ..తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story