- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో నేడు ఫైనల్ పోరు
దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ రసవత్తరంగా కొనసాగింది. నరాలు తెగే ఉత్కంఠంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ సీజన్ ఐపీఎల్ పండుగకు నేటితో తెరపడనుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పటికే నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన ముంబై ఐదో టైటిల్‌పై కన్నేసింది. అంతేగాకుండా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే కప్పు సాధించని ఢిల్లీ, మొదటిసారి కప్పు గెలవాలని కసితో ఉంది. ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. లీగ్ దశ నుంచి ప్లేఆఫ్స్ వరకు సమిష్టిగా విజయాలు సాధిస్తూ వచ్చిన ఇరు జట్లు నేడు తలపడనుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరి ఈ రోజు ఫైనల్‌లో ఏ టీమ్ గెలుస్తుందో వేచి చూడాలి.