మిలాద్ ఉన్ నబీ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ శంకర్

by Shyam |
మిలాద్ ఉన్ నబీ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ శంకర్
X

దిశ,మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలో మిలాద్ ఉన్ నబి పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని మక్తల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్ఐ రాములు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాఘవేందర్ ముస్లిం పెద్దలతో సమావేశమై చెప్పారు. మక్తల్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతోనూ, ముస్లిం మత పెద్దలతోనూ, శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్. ఆత్మకూరు పట్టణంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

కమిటీలోని అధ్యక్షుల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించుకోవాలని, యువత సంయమనం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి, మిలాద్ ఉన్ నబీ కమిటీ సభ్యులు రెహమాన్, జహీద్అలీ, రహీం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story