- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూగజీవి ప్రాణాలు కాపాడిన ఎస్పీ
దిశ, నల్లగొండ: విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడిలో ఉన్నారు ఆ ఉన్నతాధికారి.. అయినా ఆ అధికారికి వచ్చిన ఫోన్ కు వెంటనే స్పందించి ఓ మూగజీవి ప్రాణాలు కాపాడారు. మానవతా హృదయంతో స్పందించిన ఆ ఎస్పీ వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నీల అనే జంతు ప్రేమికురాలికి నల్లగొండ పట్టణంలో రోడ్డుపైన ఒక కుక్క కనిపించింది. నడుముకు దెబ్బలు తగిలి.. రెండు కాళ్లను కోల్పోయి నడవలేని స్థితిలో ఉండి అవస్థ పడుతున్నది. వెంటనే అక్కడికి చేరుకున్న నీల ఆ కుక్క ప్రాణం రక్షించే ప్రయత్నం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆ మూగజీవిని హైదరాబాద్ లోని పీఎఫ్ఏ జంతువుల షెల్టర్ కు తరలించేందుకు వాహనం కోసం జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ను సంప్రదించింది. వెంటనే ఆ ఎస్పీ స్పందించి.. వాహనం సమకూర్చాలని ఎం.టి.ఒ స్పర్జన్ రాజ్ ను ఆదేశించారు. పోలీసులు ఏర్పాటు చేసిన వాహనంలో ఆ మూగ జీవాన్ని సురక్షితంగా పీఏఫ్ఏకు తరలించి దాని ప్రాణం నిలబెట్టారు. ఈ విషయం తెలిసిన ప్రజలు, జంతు ప్రేమికులు.. ఎస్పీ రంగనాథ్ ను, ఎంటీఓ స్పర్జన్ రాజన్ ను అభినందిస్తూ పోలీసుల సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెబుతున్నారు.
Tags: Dog, Nalgonda, SP, Ranganath, Spurgeon Raj, Neela