- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇవాళ కొత్త కేసులు రెండే..
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో సోమవారం కేవలం రెండే కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ అనుమానం ఉన్న 159 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం రెండే పాజిటివ్ వచ్చాయని, మిగిలినవన్నీ నెగెటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొన్నది. కొత్తగా వచ్చిన రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1003కు చేరుకున్నది. సోమవారం 16 మంది డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 646కు చేరుకున్నది.
గత నాలుగైదు రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం తగ్గుతుండడం పట్ల కేంద్ర వైద్యారోగ్య శాఖ సైతం సంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఇంప్రూవింగ్ స్టేట్’ జాబితాలో చేర్చింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కేవలం మూడు జిల్లాలు (వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి-భువనగిరి) మాత్రమే వైరస్ బారిన పడలేదు. మరో ఏడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదైనా చికిత్స అనంతరం కోలుకోవడంతో మొత్తం పది జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అసలే లేవు. దీనికి తోడు ఒకటి రెండు రోజుల్లో మరింతమంది డిశ్చార్జ్ కానున్నందున ఆ లెక్కల ప్రకారం చూస్తే మరో 11 జిల్లాలు కూడా కరోనా-ఫ్రీగా మారిపోనున్నాయి. దీంతో రాష్ట్రంలో మూడింట రెండొంతుల జిల్లాలు కరోనా నుంచి విముక్తి అయినట్లవుతుంది.
tags: Telangana, Corona, Positive Cases