‘చనిపోయిన వ్యక్తి’ 7 గంటల తర్వాత మార్చురీ ఫ్రీజర్ నుంచి బయటకు..

by Shyam |   ( Updated:2023-03-14 09:20:48.0  )
‘చనిపోయిన వ్యక్తి’ 7 గంటల తర్వాత మార్చురీ ఫ్రీజర్ నుంచి బయటకు..
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలోని మొరాదాబాద్‌లో ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు ప్రకటించి, మార్చురీ ఫ్రీజర్‌లో ఏడు గంటలకు పైగా ఉంచిన తర్వాత అతను బ్రతికి వచ్చాడు. మొరాదాబాద్‌కు చెందిన శ్రీకేష్ కుమార్‌ (40) పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నారు. అయితే గురువారం రాత్రి వేగంగా వస్తున్న ఓ మోటార్‌ బైక్ అతన్ని గట్టిగా ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న వైద్యులు శ్రీకేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మరుసటి నాడు పోస్ట్ మార్టం చేయడానికి వారు అతనిని మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు.

దాదాపు ఏడు గంటల తర్వాత, మృతదేహానికి శవపరీక్ష చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించిన తరువాత సంతకం చేసిన ‘పంచనామా’ పత్రాన్ని పోలీసులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కుమార్ కోడలు మధుబాల డెడ్ బాడీని చూసి నిర్ధారించే సమయంలో అతనితో కదలిక కనిపించడం గమనించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు శరీరం చుట్టూ గుమిగూడి వైద్యులు మరియు పోలీసులను వివిధ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఫ్రీజర్ నుంచి కుమార్ సజీవంగా బయటకు వచ్చిన తర్వాత, అతని పరిస్థితి మెరుగుపడినట్టు అధికారులు వెల్లడించారు. అయితే అతను ఇంకా స్పృహలోకి రాలేదని అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని వైద్యులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్టు శ్రీకేష్ కుటుంబం తెలిపింది.

Advertisement

Next Story