- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాత్ రూమ్ లో తల్లి ఆ పనిచేస్తుండగా లైవ్ పెట్టిన కూతురు, చివరికి
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలతో తల్లిదండ్రులకు పెద్ద చిక్కే. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. వాళ్లు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడుతుంటారు. 24 గంటలూ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండటం పేరెంట్స్ వల్ల కాదు. పైగా పిల్లలు అల్లరి చేస్తుంటే.. వారిని ఓదార్చేందుకు తల్లిదండ్రులు మొబైల్‌లో ఆటల సాంగ్స్ వీడియోస్ ప్లే చేసి.. మొబైల్‌ని పిల్లలకు ఇచ్చేస్తుంటారు. కానీ, దానివలన వచ్చే అనర్థాలు ఒకటి రెండు కావు. కొన్నిసార్లు ఆ మొబైల్ తో పిలల్లు చేసే పనులు తల్లిదండ్రులకు షాకిస్తున్నాయి. తాజాగా ఒక చిన్నారి చేసిన పని తల్లి పరువు తీసింది. ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ వెళ్లి తల్లి స్నానం చేస్తున్న వీడియోను తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పెట్టేసింది. ఈ ఘటన అమెరికాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. బ్రియాన్నా అనే ఒక మహిళ అమెరికాలో నివసిస్తోంది. కాగా, ఇటీవల తన జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని ఘటన గురించి ఆమె నెటిజన్లతో పంచుకోంది. తాను స్నానం చేస్తున్నప్పుడు తన కూతురు తనను ఇన్‌స్టాగ్రామ్ లైవ్ పెట్టిందని చెప్పుకొచ్చింది. “ఒక రోజు నేను స్నానం చేయడానికి వెళ్తున్నా..నా కూతురు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి తనకి ఫోన్ లో గేమ్ పెట్టి ఇచ్చాను. తాను గేమ్ లో మునిగిపోయిందనుకొని నేను వెళ్లి స్నానం చేస్తున్నా.. అప్పుడే నా కూతురు డోర్ కొట్టింది. తలుపు తీసి ఏంటి అని అడిగితే.. గేమ్ రావడం లేదని చెప్పింది. దీంతో నేను తడిచేతులతో ఫోన్ ముట్టుకోకుండా టవల్ తో తుడుచుకొని ఫోన్ చూసి షాకయ్యాను. అక్కడ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చూసి అవాక్కయ్యాను. బాత్ రూమ్ మొత్తం లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని గమనించి వెంటనే ఆ లైవ్ ని ఆపేశాను”.
గేమ్ ఓపెన్ కాకపోవడంతో చిన్నారి ఏదిపడితే అది నొక్కడంతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ఓపెన్ అయ్యిందని, అలా బాత్ రూమ్ లోకి రావడంతో తాను కనిపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇంత చేసినా చిన్నారిని ఏం అనాలో తెలియక ఇబ్బంది పడ్డానని చెప్పుకోచ్చింది. ఇక ఈ విషయాన్ని ఆమె ద్వారా టిక్‌టాక్‌లో తెలుసుకున్న నెటిజన్లు.. కొందరు నవ్వుతూ కామెంట్స్ పెట్టగా.. మరికొందరు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంకొందరు తాము స్నానానికి వెళ్లినప్పుడు పిల్లలు బయట డోర్ వేసేసిన ఘటనల్ని ప్రస్తావించారు.
“పిల్లలకు మొబైల్ ఇచ్చేముందు.. చైల్డ్ సెట్టింగ్స్‌ని యాక్టివేట్ చెయ్యండి. అప్పుడు వాళ్లు ఇలాంటివి చెయ్యడానికి వీలుండదు. మీరు ఇచ్చిన యాప్ తప్ప వేరే యాప్ ఓపెన్ చెయ్యలేరు” అని ఓ యూజర్ సలహా ఇవ్వగా.. మరో మహిళ.. తాను స్నానం చేస్తున్నప్పుడు తన కూతురు.. తెలియకుండానే ఫేస్‌బుక్ లైవ్ పెట్టిందని చెప్పారు.